Site icon HashtagU Telugu

Delhi LIquor Scam : ఢిల్లీ లిక్క‌ర్‌స్కాం కేసులో బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు అరెస్ట్‌

CBI Takes Over Probe

CBI Takes Over Probe

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో హైద‌రాబాద్‌కి చెందిన ఓ వ్యాపారిని సీబీఐ అరెస్టు చేసింది. బోయినపల్లి అభిషేక్ రావును సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అతను జూలై 12, 2022న స్థాపించిన‌ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ LLP డైరెక్టర్లలో ఒక‌రిగా ఉన్నారు. GNCTD యొక్క ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసు విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో సదరు వ్యక్తి ఏజెన్సీకి సహకరించడం లేదని, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. విచారణలో అతని పేరు రావడంతో చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్ప‌టికి వ‌ర‌కు సీబీఐ ఇద్ద‌రిని అరెస్ట్ చేసింది.