Hyd Student: హైదరాబాద్‌‌ కుర్రాడికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌‌.. అమెరికా వర్సిటీలో సీటు

హైదరాబాద్‌‌కు చెందిన ఇంటర్ విద్యార్థి వేదాంత్ ఆనంద్‌వాడే (18) కు గొప్ప అవకాశం లభించింది.

Published By: HashtagU Telugu Desk
Vedant

Vedant

హైదరాబాద్‌‌కు చెందిన ఇంటర్ విద్యార్థి వేదాంత్ ఆనంద్‌వాడే (18) కు గొప్ప అవకాశం లభించింది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ లో న్యూరోసైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌‌ లభించింది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్ షిప్ లెటర్ ను పంపించింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని వేదాంత్‌
పూర్తి చేశాడు. వేదాంత్‌ తండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటిస్టుగా, తల్లి ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే స్వచ్ఛంద సంస్థ “డెక్ట్సేరిటీ గ్లోబల్” వేదాంత్‌ ప్రతిభను గుర్తించి మార్గదర్శనం చేసింది. దీంతో అతడు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌‌కు ఎంపికయ్యాడు. ఈ నెల 12న వేదాంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. వైద్యశాస్త్రంలో కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ వర్సిటీ ర్యాంక్ 16. ఇప్పటివరకు ఇక్కడ చదివిన వారిలో 17 మందికి నోబెల్ ప్రైజ్ లు వచ్చాయి.

Vedant with his father Dr A Prabhu

  Last Updated: 07 Aug 2022, 02:09 PM IST