Site icon HashtagU Telugu

Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్

Book Fair

Book Fair

Book Fair: హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బుక్‌ ఫెయిర్‌ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్‌ ఫెయిర్‌ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్‌ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్‌ ఫెయిర్‌ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత రవ్వా శ్రీహరి పేరును నామకరణం చేసినట్టు తెలుస్తోంది.

ప్రారంభో త్సవం రోజున ప్రధాన వేదిక వద్ద అమర వీరుల స్థూపం ఏర్పాటు చేసి అమరులకు నివాళులర్పి స్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బుక్‌ ఫెయిర్‌ నిర్వహణకు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కొలువుదీరబోతున్న బుక్‌ ఫెయిర్‌లో 365 స్టాల్స్‌ ఉండబోతున్నాయి.

ప్రతీ సారిలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే ఈ బుక్ ఫెయిర్ జరగుతుంది. మద్యాహ్నం 2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.