Site icon HashtagU Telugu

Hyderabad Biryani: ఆన్ లైన్ డెలివరీలో హైదరాబాద్ బిర్యానీ టాప్, రంజాన్ లో 10 లక్షల డెలివరీలు

Biryani

Biryani Imresizer

రంజాన్ మాసంలో అత్యథికంగా హలీంకి (Heleem) డిమాండ్ ఉంటుందని, బిర్యానీలకు డిమాండ్ తగ్గుతుందని, ఆన్ లైన్ లో కూడా తమకు ఆర్డర్లు తక్కువగా వస్తాయని భావించింది స్విగ్గీ సంస్థ. కానీ హైదరాబాదీ (Hyderabad)లు గత రికార్డ్ ని బ్రేక్ చేశారంటూ తాజాగా ఓ లిస్ట్ విడుదల చేసింది. రంజాన్ మాసంలో ఆన్ లైన్ లో బిర్యానీకోసం స్విగ్గీ సంస్థకు 10లక్షల ఆర్డర్లు వచ్చాయట. గతేడాదికంటే ఇది 20శాతం అధికం.

ఒక్క స్విగ్గీకే 10లక్షల బిర్యానీల (Biryani) ఆర్డర్లు వస్తే, ఇక జొమాటో వంటి ఇతర సంస్థలకు కూడా ఆ స్థాయిలోనే బిజినెస్ జరిగి ఉంటుంది. నేరుగా బిర్యానీ పాయింట్ లకు వెళ్లి పార్శిళ్లు తీసుకెళ్లే వారి సంఖ్యా తక్కువేం కాదు. మొత్తానికి రంజాన్ నెలలో బిర్యానీకి డిమాండ్ తగ్గి హలీంకి డిమాండ్ పెరుగుతుందనే అంచనా పటాపంచలైంది. నెలరోజల వ్యవధిలో హలీం కోసం స్విగ్గీకి 4 లక్షల ఆర్డర్లు వచ్చాయి. బిర్యానీకి 10 లక్షల మంది ఆర్డర్ ఇచ్చారు. గతేడాది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు వేసిన లెక్కల ప్రకారం బిర్యానీయే టాప్ ఆర్డర్ (Top order) గా నిలిచింది. అత్యథిక ఆన్ లైన్ డెలివరీలు బిర్యానీవే.

Exit mobile version