Hyderabad: రద్దీగా మారిన హైదరాబాద్ విమానాశ్రయం

విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్ విమానాశ్రయం కిటకిట లాడుతుంది. ప్రయాణికుడిని సాగనంపడం కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
New Web Story Copy 2023 08 07t114306.523

New Web Story Copy 2023 08 07t114306.523

Hyderabad: విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్ విమానాశ్రయం కిటకిట లాడుతుంది. ప్రయాణికుడిని సాగనంపడం కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికుడి అసౌకర్యాన్ని ఎత్తి చూపుతుంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరంలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో విమానాశ్రయాన్ని కూడా హై సెక్యూరిటీ అలర్ట్‌లో ఉంచింది. ఈ మేరకు అక్కడి సిబ్బంది సందర్శకుల్ని అభ్యర్ధించింది. వాహనాల సంఖ్యను స్వీయ-నియంత్రణకు సహరించాలని కోరింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడాతో సహా చాలా విదేశాలకు వెళ్లే వారు సాధారణంగా జూలై లేదా ఆగస్టులో ప్రయాణిస్తారు. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ సమస్య తలెత్తుతున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడంతో హైదరాబాద్‌ త్వరలో రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.

Also Read: Rahul Victory :మళ్లీ లోక్‌సభకు రాహుల్‌ గాంధీ.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ

  Last Updated: 07 Aug 2023, 11:48 AM IST