Meter Tampering : 70 శాతం విద్యుత్ మీట‌ర్ల టాంప‌రింగ్

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 70 శాతం మంది విద్యుత్ వినియోగ‌దారులు మీట‌ర్ల‌ను టాంప‌ర్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 28, 2022 / 09:15 PM IST

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 70 శాతం మంది విద్యుత్ వినియోగ‌దారులు మీట‌ర్ల‌ను టాంప‌ర్ చేస్తున్నారు. విద్యుత్ రీడింగ్ ను తారుమారు చేస్తున్నారు. అత్య‌ధికంగా చార్మినార్ ప్రాంతంలోని వినియోగ‌దారులు 80శాతం మంది అత్య‌ధికంగా బ‌కాయిలు ప‌డ్డారు. ఆ విష‌యాన్ని తెలంగాణ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSPDCL) ప‌రిధిలో మొత్తం 6.3 లక్షల మంది వినియోగదారులను క‌లిగిన చార్మినార్ జోన్ అతి పెద్ద‌ది.

ఇక్క‌డ విద్యుత్ మీటర్ల ట్యాంపరింగ్‌కు సంబంధించి అత్యధిక శాతం కేసులను నమోదు చేసింది. అత్యధిక సంఖ్యలో విద్యుత్ దొంగతనాలను నమోదు చేసింది. ఇంకా రూ. 52 కోట్ల బకాయి బిల్లులు, విద్యుత్ చౌర్యం తదితరాల్లో రికవరీ చేయాల్సి ఉంది. 70 శాతం మంది వినియోగదారులు మీటర్ ట్యాంపరింగ్ మరియు తప్పుడు మీటర్ రీడింగ్‌లకు పాల్పడుతున్నారని TSSPDC అధికారులు ఆందోళన చెందుతుఉన్నారు. చార్మినార్ జోన్‌లో 80 శాతం మంది వినియోగదారులు డొమెస్టిక్ కేటగిరీకి చెందినవారు. ఆ తర్వాతి స్థానాల్లో పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఉన్నాయి.

ఇందులో చార్మినార్, అరమ్‌గఢ్ మరియు బేగమ్ బజార్ ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ మోసాల‌ను గుర్తించడానికి విజిలెన్స్ బృందాలు ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్‌లను ప్రారంభించాయి. ఆ మేర‌కు డిపార్ట్‌మెంట్ అధికారి వెల్ల‌డించాడు. ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించ‌డం ద్వారా విద్యుత్ చౌర్యం మరియు ట్యాంపరింగ్‌పై కేసులు నమోదు చేయ‌డానికి TSSPDCL సిద్ధం అయింది.