Site icon HashtagU Telugu

Hyderabad: బంజారాహిల్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. మూడు కార్లు దగ్ధం

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ రోజు శనివారం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లోని సరిత అపార్ట్‌మెంట్ ముందు మూడు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక కారులో మంటలు చెలరేగగా, 3:50 గంటలకు సమీపంలో మరో రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. పార్క్ చేసిన మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా కార్లు మంటల్లో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన ఈ కార్లను అనధికార ప్రాంతంలో పార్క్ చేశారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పార్కింగ్ సమస్యల కారణంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కార్లలో నిప్పు పెట్టారని స్థానికులు అనుమానిస్తున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Ayodhya Temple Lock : వామ్మో…అయోధ్య రామ మందిరానికి ఎంత పెద్ద తాళమో..!!