Hyderabad: హైదరాబాద్ లో 235 వాహనాలు వేలానికి రెడీ

హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దాదాపు 235 వాహనాలను వేలం వేయనున్నట్టు పోలీసులు తెలిపారు. అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచిన పలు వాహనాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి.

Hyderabad: హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దాదాపు 235 వాహనాలను వేలం వేయనున్నట్టు పోలీసులు తెలిపారు. అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచిన పలు వాహనాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వారు వాహనాలను వేలం వేస్తారు . క్లెయిమ్ చేస్తే అసలు యజమానులకు వాహనాలను తిరిగి ఇచ్చేస్తారు. ఈ వాహనాల గురించి వివరణాత్మక సమాచారం, వేలానికి సంబందించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

వేలం ప్రకటన అనంతరం ఆరు నెలల వ్యవధిలో వాహనానికి సంబంధించిన తగిన పత్రాలు లేదా సాక్ష్యాలను వాహనాల యజమానులు సమర్పించాలని కోరారు కమిషనరేట్.వారి ఆధారాలను ధృవీకరించిన తర్వాత వాటి నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వబడతాయి. మరింత సమాచారం కోసం రాచకొండలోని డిసిపి ప్రధాన కార్యాలయం, అంబర్‌పేట కార్యాలయంలో 8712662661 మరియు 8008338535 నంబర్‌లలో సంప్రదించవచ్చు.

ట్రాఫిక్‎ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పలు వాహనాలను పోలీసులు సీజ్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచుతారు. పలు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే వందలాది వాహనాలు దర్శనమిస్తాయి. నో పార్కింగ్ ప్రదేశాల్లో వదిలేసిన వాహనాలు కావొచ్చు, డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు, లేదా ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తూ పట్టుబడిన వాహనాలను పొలుసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే యజమానులు వాహనాలను తీసుకెళ్లకపోవడంతో అలాంటి వాహనాలను వేలం వేస్తుంటారు. వాహనాలపై ఉన్న ఫైన్ ప్రభుత్వానికి చెల్లిస్తే వాటిని నిజమైన యజమానులకు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీనికి ఆరు నెలల వరకు గడువు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: New Teachers Salaries : ఇకపై ఏపీలో కొత్త టీచర్లకు శాలరీలు ఇలా ఇస్తారు..