Panjagutta PS : పంజాగుట్ట పోలీస్ సిబ్బంది మొత్తం బదిలీ ..సీపీ సంచలన నిర్ణయం

హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో (Panjagutta Police Station)ని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. 80 మందికి పైగా పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి అన్ని శాఖల్లో బదిలీల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్లుగా గత ప్రభుత్వంలో […]

Published By: HashtagU Telugu Desk
Hyd Cp Transfers All 86 Pol

Hyd Cp Transfers All 86 Pol

హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో (Panjagutta Police Station)ని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. 80 మందికి పైగా పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేశారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి అన్ని శాఖల్లో బదిలీల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్లుగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిని సీఎం రేవంత్ బదిలీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లోని అధికారులను బరిలో చేయడం చేసారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. మొత్తం 82 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. హోంగార్డు నుంచి ఇన్ స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేసుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు బయటకి పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పంజాగుట్ట పీఎస్‌కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు.

Read Also : Kumari Aunty : కుమారి ఆంటీకి సీఎం రేవంత్ గుడ్ న్యూస్…

  Last Updated: 31 Jan 2024, 01:25 PM IST