హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ పాతనగరంలో పర్యటించారు. చార్మినార్, మక్కా మసీదులతో పాటు పలు స్ట్రీట్స్ లో సీపీ తిరుగుతూ పర్యాటకులతో పాటు, స్థానికులతో మాట్లాడారు.
పాతనగరపు అధికారులతో సమావేశమైన సీపీ అక్కడి శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని, వారు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సీపీ అధికారులకు సూచించారు.