Crime News: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్యను కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోటుచేసుకుంది

Published By: HashtagU Telugu Desk
Pakistan Man Killed Wife

Crime News

Crime News: భార్యను కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటన జరిగిన తీరుపై విచారణ చేపట్టారు.

గత కొంతకాలంగా భార్య సంతోషి, భర్త రాజుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. భర్త రాజు లారీ డ్రైవర్‌గా గుర్తించారు. మంగళవారం సాయినగర్‌లో భార్య సంతోషి (35)ను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం సరూర్‌నగర్‌లోని తపోవన్‌ కాలనీలో భర్త సోదరి ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, వారిలో ఒకరు ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. వారి స్వస్థలం ఆమనగల్ సమీపంలోని ఆకుతోటపల్లి.తల్లి దండ్రులు ఒకేరోజు మరణించడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.

Also Read: Niharika Konidela : నిహారిక తట్టుకోలేకపోతుందా..? మనల్ని తట్టుకోలేకుండా చేస్తుందా..?

  Last Updated: 17 Oct 2023, 06:23 PM IST