Site icon HashtagU Telugu

Odisha Crime News: భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త

Odisha Crime News

New Web Story Copy 2023 05 25t200414.800

Odisha Crime News: భార్య తల మొండం వేరు చేశాడు కసాయి భర్త. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, తల నరికి పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మృతురాలిని ఊర్మిళా కర్జీగా, నిందితుడు భర్త చంద్రశేఖర్ కర్జీ అలియాస్ మున్నాగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఉదయం తన భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు, అక్కడ ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో తాళి కట్టిన భర్త భార్యను కడతేర్చాడు. పొలాల్లో నుంచి భార్య తలతో తిరిగి వస్తున్న మున్నాను చూసి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇంటికి చేరుకోగానే తలను తన ఇంటి తలుపు ముందు ఉంచాడు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, తెగిపడిన తల దగ్గర మున్నా నిశ్శబ్దంగా కూర్చున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో తన భార్యను హత్య చేసి ఛిద్రం చేశానని ఆ వ్యక్తి అంగీకరించాడు.మృతదేహాన్ని పొలంలో వదిలేసి తలను మాత్రమే ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని, తలను సేకరించి పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ దారుణ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం ప్రకారం చంద్రశేఖర్‌కు ఊర్మిళ రెండో భార్య అని, వీరికి రెండేళ్ల పాప ఉంది. చంద్రశేఖర్ మొదటి భార్యపై కూడా క్రూరత్వం ప్రదర్శించడంతో కొన్నాళ్ల క్రితం అతడిని వదిలి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Read More: Nara Lokesh : లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్‌.. మ‌ళ్లీ ప్రారంభం ఎప్పుడంటే..