Site icon HashtagU Telugu

Human DNA: ఎక్కబడట్టినా మానవులు డీఎన్‌ఏనే.. కీలక విషయం బయటపెట్టిన సైంటిస్టులు..!

Dreamstime S 38848521

Dreamstime S 38848521

Human DNA: వాతావరణంలోని ప్రతీచోటా మానవుల డీఎన్‌ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కొనుగోన్నారు. నీరు, ఇసుక, మట్టి వంటి నమూనాలను సైంటిస్టులు సేకరించి పరీక్షలు జరిపారు. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో మినహా మిగతా అన్ని ప్రదేశాల్లో మానవుల డీఎన్‌ఏను కనుగొన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మానవులు జీవిస్తుండటంతో.. వాతారణంలో కూడా డీఎన్‌ఏ ఆనవాళ్లు గుర్తించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. గాలి, నీరు, మట్టి, ఇసుక.. ఇలా ప్రతీచోట డీఎన్‌ఏ నమూనాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

శరీరంలోని ప్రతీ కణంలోనూ సాధారణంగా డీఎన్‌ఏ ఉంటుంది. రక్తం, స్వామ్, జీవాణువులను సేకరించి డీఎన్‌ఏ టెస్ట్ లు జరుపుతారు. ప్రతిఒక్కరిలోనూ డీఎన్‌ఏ భిన్నంగా ఉంటుంది. పరీక్షల ద్వారా విశ్లేషించి వ్యక్తి యొక్క పరిణామ క్రమాన్ని గుర్తిస్తారు. జంతువుల డీఎన్‌ఏలను కూడా ఇలాగే సేకరించి వాటి పరిణామ క్రమాన్ని గుర్తించారు. దీంతో వాతావరణంలో కూడా డీఎన్‌ఏ ఆనవాళ్లు కన్పిస్తున్నాయి.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డప్పీ ల్యాబ్స్ నేతృత్వంలో జన్యు, పర్యావరణ, సముదర్ జీవ శాస్త్రవేత్తలు టీమ్ గా ఏర్పడి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో వాతావరణంలో మానవుల డీఎన్‌ఏ ఆనవాళ్లు కనుగొన్నారు. తుమ్ము, దగ్గు, మల, మూత్ర విసర్జన కారణంగా మానవుల డీఎన్‌ఏ ఆనవాళ్లు వాతవరణంలో ఉంటున్నాయి. జంతువుల సంచారం, వ్యాధు పరిణామ క్రమాన్ని తెలుసుకునేందుకు సైంటిస్టులు వాతావరణంలోని డీఎన్‌ఏ ఆనవాళ్లను సేకరిస్తారు. అయితే జన సంచారం ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో ఎక్కడబట్టినా మానవుల డీఎన్‌ఏ లభిస్తోంది.

పర్యావరణంలో డీఎన్‌ఏ నమూనాలు కలిసిపోవడాన్ని ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ లేదా ఈడీఎన్‌ఏ అంటారు. అంతరించిపోతున్ప జీవుల గురించి తెలుసుకునేందుకు వీటని సైంటిస్టులు వాతావరణంలో సేకరిస్తారు. ఈడీఎన్‌ఏ పరికరాలను జీవుల నమూనాలను సేకరించడం కోసమే ఉపయోగిస్తారు. ఈ నమూనాల్లో ఎక్కువగా మానవుల డీఎన్‌ఏలు బయపడుతున్నాయి.

Exit mobile version