Site icon HashtagU Telugu

NTR’s Coin: ఎన్టీఆర్ నాణేనికి భారీ స్పందన.. అభిమానుల సందడే సందడి

Ntr Coin Price

Ntr Coin Price

నందమూరి తారక రామారావు వందవ జయంతిని పురస్కరించుకుని రూపొందించిన వంద రూపాయల వెండి నాణెం విడుదల చేయడం పట్ల విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్, చర్లపల్లి నాణేల ముద్రణ కేంద్రాలలో ఈ ఉదయం 10 గంటలకు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ వంద రూపాయల వెండి నాణేన్ని కొనుగోలు చేసేందుకు అభిమానులు బారులు తీరారు. మింట్ కేంద్రం 4,050 రూపాయల నుండి 4,850 రూపాయల వరకు విక్రయిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులతో రాకతో  సైఫాబాద్, చర్లపల్లి టంకశాల సెంటర్లలో సందడి నెలకొంది.

ఈ స్మారక నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ లోనే తయారు చేస్తున్నారు. ఈ నాణెం తయారీలో నాలుగు లోహాల మిశ్రమాన్ని ఉపయోగించినట్లు హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఈ నాణెం తయారీకి 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఈ ప్రత్యేక స్మారక నాణేన్ని తయారు చేశారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని రూ. 100 నాణెంగా దీనిని రూపొందించారు.

Also Read: BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?