Hyderabad: ధూల్‌పేటలో భారీగా నల్లమందు సీజ్.. మంత్రి జూపల్లి రియాక్షన్

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 11:24 PM IST

Hyderabad: హైదరాబాద్ ధూల్‌పేటలో భారీగా నల్లమందును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. 1.5 కోట్ల విలువైన 160 కిలోల మందును పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో
మాదకద్రవ్యాల రహిత రాష్ట్రాంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

SOT బాలానగర్ టీమ్ మరియు సనత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా సనత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- విలువ గల 2.3 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళం కు చెందినవాడు.  జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడని, గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నందున హైదరాబాద్‌కు లో గంజాయిని అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని భావించి, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.