తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రోజు (గురువారం) సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం స్వామివారిని 78,487 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధాకారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
TTD : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?

Tirumala