Central Govt: భారీగా కేంద్ర ప్రభుత్వ కొలువులు… ఈ సారి అప్లై చేస్తే పక్కా !

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కబురిచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 23 At 19.03.14

Whatsapp Image 2023 03 23 At 19.03.14

Central Govt: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కబురిచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేష‌న్ ఇచ్చింది. మొత్తం 5,369 ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విధానం ద్వారా భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పోస్టులను భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో 11, పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడులో ఎనిమిది కేంద్రాలతో సహా మూడు రాష్ట్రాల్లోని 22 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయ‌ని నోటిఫికేష‌న్ లో ఉంది. చెన్నైలోని ఎస్ఎస్సీ (సదరన్ రీజియన్)కు సంబంధించి 455 ఖాళీలతో 58 కేటగిరీల పోస్టులకు ఫిబ్రవరి 24న ‘ఫేజ్ 11/2023/సెలక్షన్ పోస్టులు’ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో 22 గ్రాడ్యుయేట్ స్థాయి, 19 హయ్యర్ సెకండరీ స్థాయి, 17 మెట్రిక్ స్థాయి పోస్టులు ఉన్నాయి. వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలను సరిచూసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రామాణిక రుసుముతో సహా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 27గా ప్ర‌క‌టించారు.అభ్య‌ర్థులు ssc.nic.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 27, ఫీజును మార్చి 28లోగా ఆన్లైన్ లో చెల్లించాలి.

  Last Updated: 23 Mar 2023, 07:47 PM IST