Site icon HashtagU Telugu

Mumbai: ఏంటి! సమోసా, చాయ్ రూ.490 నా.. ఫొటో వైరల్?

Mumbai

Mumbai

చాలామంది ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్ లో చాయ్ సమోసా కాంబినేషన్ కూడా ఒకటి. వీటి కాంబినేషన్ నే వేరు అని చెప్పవచ్చు. టీ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే పెద్దపెద్ద కాలేజీలో ఇతర వాటిలలో క్యాంటీన్లలో టీ ఉంది అంటే తప్పకుండా సమోసా ఉంటుంది. సాధారణ స్నాక్స్ లా వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే టీ, సమోసా ధర మామూలుగా 50 రూపాయలకు మించి ఉండదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో ఒక టీ, ఒక సంవత్సరం ధర దాదాపుగా 499.ఎక్కడో అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముంబై ఎయిర్‌ పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్‌ వేశారు. అయితే ఇదే ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరాఖాన్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్‌ టీ, ఒక వాటర్‌ బాటిల్‌ ధర 490 గా అని తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ మంచి రోజులు వచ్చాయి అనే క్యాప్షన్‌ ను కూడా జోడించింది. ఆమె షేర్ చేసిన ఆ ఫొటోలలో సాధారణ సైజ్‌ కలిగిన రెండు సమోసాలు ఒక కప్పు చాయ్ కనిపిస్తోంది.

చాయ్‌ సమోసా పై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్ ముంబై కండివాలీ రైల్వే స్టేషన్‌లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్‌ దొరుకుతుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరొకొందరు ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ రూ.490నా అంటూ షాక్‌ అవుతున్నారు.