Site icon HashtagU Telugu

WhatsAPP : వాట్సాప్‌లో తలక్రిందులుగా టైప్ చేయడం ఎలాగో తెలుసా..?

3d01f756 B3e8 4bab 94f7 64969293511a

3d01f756 B3e8 4bab 94f7 64969293511a

వాట్సాప్ ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ ను నిత్యం కోట్లాది మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ వాట్సాప్ లో మెసేజ్ లను టైపింగ్ చేసి పంపించడం కోసం విభిన్నమైన ఫాంట్ శైలులు అలాగే ఫార్మాట్లను చాలా మంది ప్రయత్నించి ఉండకపోవచ్చు. కొందరు వాట్సాప్ లో అన్ని రకాల ఫీచర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాట్సాప్లో మనం పంపించే టెక్స్ట్ మెసేజ్ ను పూర్తిగా తిప్పి, రివర్స్ లో కూడా పంపవచ్చు. ఇందుకోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది.

అయితే కేవలం వాట్సాప్ లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్ అలాగే ఇతర యాప్ ల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. మీరు ఫ్లిప్ టెక్స్ట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అందుకోసం ముందుగా ముందుగా, ప్లే స్టోర్‌కి వెళ్లి, అప్‌సైడ్ డౌన్ (ఫ్లిప్ టెక్స్ట్) డౌన్‌ లోడ్ చేసిన తర్వాత, అప్లికేషన్‌ను తెరవగా అప్పుడు అది తాజా సంస్కరణను డౌన్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు సరే అనే ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు.

అలా చేసిన తర్వాత, స్క్రీన్ రెండు భాగాలుగా విభజించబడిందని చూపించగా అందులో మొదటి విభాగంపై క్లిక్ చేసి తలక్రిందులుగా (రివర్స్) లో పంపాలనుకుంటున్న మెసేజ్ ను టైప్ చేసిన తర్వాత దిగువ విభాగంలో నొక్కితే, మీరు విలోమ వచనాన్ని చూస్తారు.అప్పుడు మెసేజ్ ని పూర్తి చేసిన తర్వాత దిగువన రెండు స్క్రీన్ ఎంపికలు కనిపిస్తాయి, అవి క్లియర్ లేదా కాపీ మీరు వచనాన్ని కాపీ చేసి, వాట్సాప్ , టెలిగ్రామ్ లేదా జిమెయిల్ తో సహా మీకు కావలసిన అప్లికేషన్‌లో అతికించవచ్చు.