Site icon HashtagU Telugu

Recipe : సండే స్పెషల్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..?మటన్ కుర్మా ఓ సారి ప్రయత్నించండి..!!

Mutton Kurma

Mutton Kurma

నాన్ వెజ్ ప్రియుల కోసం…ఇంట్లోనే మటన్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. మటన్ కుర్మా అనేది సంప్రదాయ వంటకం. మసాల దినుసులతో చేసే వెరైటీ వంటకం. ముఖ్యంగా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు…సాధారణ పద్ధతుల ద్వారా ఇంట్లోనే మటన్ కుర్మను తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
1/2 కిలోల మటన్
1 కప్పు పెరుగు
3 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు
3 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
1 కప్పు వేయించిన ఉల్లిపాయ
1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్
2 టేబుల్ స్పూన్లు రుచికరమైన పౌడర్
2 – లవంగం ఆకు
2 – బ్లాక్ ఏలకులు
2 – చక్
6 – ఆకుపచ్చ ఏలకులు
6 – లవంగాలు
తగినంత ఉప్పు
కాల్సిననన్నీ నీరు
5 టేబుల్ స్పూన్ ప్రాసెస్డ్ ఆయిల్

తయారీ విధానం:

ఒక బౌల్ తీసుకుని అందులో మటన్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కారం పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, బిర్యాని ఆకు వేసి బాగా కలపాలి. స్టౌవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టాలి. అందులో నూనె పోసి వేడి అయ్యాక లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకుతోపాటు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేయాలి. ఇప్పుడు మెరినేట్ చేసుకున్న మటన్ అందులో వేయాలి.

ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంటమీద మగ్గిన తర్వాత కావాల్సినన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టాలి. 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అంతే మటన్ కుర్మా రెడీ. మటన్ కుర్మా చపాతీతో కూడా అన్నంలో కానీ తింటే అదిరిపోయే రుచి ఉంటుంది. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

Exit mobile version