Site icon HashtagU Telugu

Beauty Tips: మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం కోవాలంటే.. నిమ్మకాయతో ఈ విధంగా చేయాల్సిందే!

Beauty Tips

Beauty Tips

మాములుగా ప్రతీ ఒక్కరు మెరిసేపోయే చర్మాన్ని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పొల్యూషన్, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా అనేక చర్మ సంబంధింత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, పొడిబారడం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. అందమైన ముఖం కోసం చాలా ఖర్చు చేస్తుంటాం. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటాము. అయినా ఫలితం ఉండదు. కాగా చాలా మంది డార్క్ స్పాట్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందులో నిమ్మకాయ ఒకటి. మరి నిమ్మకాయతో ఆ డార్క్ స్పాట్స్ ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

​నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మ మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మపు ఛాయను మెరుపర్చడంలో నిమ్మకాయ ప్రభావవంతంగా పనిచేస్తుందట. నిమ్మ కాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖంపై నుంచి మొటిమలు, పిగ్మెంటేషన్‌ ను తొలగించడంలో సహాయపడతాయట. ఈ నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడటం వల్ల అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చని చెబుతున్నారు.

​ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి నిమ్మకాయ, తేనెను ఉపయోగించవచ్చట. తేనె చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుందట. ఈ కాంబినేషన్ మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో సహాయపడుతుందట. ఇందుకోసం గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి కొంత సేపు అలాగే ఉంచాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటిలో వాష్ చేసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ రెమిడీ వాడటం వల్ల మచ్చలు తొలగిపోవడమే కాకుండా చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుందట.

ముఖం మీద మచ్చలతో ఇబ్బంది పడేవారికి పెరుగు, నిమ్మకాయ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. పెరుగులో నిమ్మకాయ కలిపి అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు తొలగిపోతాయట. కాగా పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుందట. ఇది మచ్చలను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకొని,దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి తేలికగా, మృదువుగా మసాజ్ చేయాలట. పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలట. ఆ తర్వాత ముఖాన్ని నీటితో వాష్ చేసుకోవాలి. దీని వల్ల మచ్చలు, ముడతల సమస్య తొలగిపోతుందట. అంతేకాకుండా ముఖంలో గ్లో కూడా వస్తుందని చెబుతున్నారు.