Diabetes: మీకున్న డయోబెటీస్ ఏదో తెలుసా…గుర్తించండిలా..!!

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 07:30 AM IST

మధుమేహం లేదా డయాబెటిస్ ఇందులో రెండు రకాలు ఉంటాయి. 1.టైప్1-డయాబెటిస్, 2. టైప్2-డయాబెటిన్. నిజానికి ఈ రెండింటి మధ్య చాలామందికి తేడా తెలియదు. ఈ రోజుల్లో షుగర్ సాధారణంగా సోకే వ్యాధుల జాబితాలో చేరింది. కానీ ఈ వ్యాధి కొన్ని సార్లు ప్రాణాలమీదకు తెస్తుంది. దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవడమే మంచిది. ఈ రెండింటి మధ్య ఎలాంటి తేడా ఉంటుందో తెలుసుకుందాం.

రెండింటి మధ్య వ్యత్యాసం:
సాధారణంగాఈ రెండు డయాబెటిస్ లు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే డయాబెటిస్ ఉన్నవారిలో ఏ సందర్భంలోనైనా శరీరం గ్లూకోజ్ ను సరిగ్గా నిల్వచేయకపోవంతో పాటు…దాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. మనం శక్తిని పొందడానికి గ్లూకోజ్ నిల్వ అనేదిచాలా అవసరం.అలాగే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. కానీ డయాబెటిస్ రోగుల్లో ఇది జరగదు. అవసమైన సమయాల్లో గ్లూకోజ్ కణాలకు అందదు. దీనికి బదులుగా ఈ గ్లూకోజ్ రక్తాన్నిచేరుతుంది. ఈ విధంగా డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.

టైప్ -1 డయాబెటీస్:
గ్లూకోజ్ కణాలను చేరాలంటే…ఇన్సులిన్ చాలా అవసరం ఉంటుంది. కానీ టైప్ 1 డయాబెటీస్ రోగుల శరీరంలో అసలు ఇన్సులిన్ అనేది ఉత్పత్తికాదు. ఈ టైప్ 1 డయాబెటిస్ ఆటో ఇమ్యూన్ , జన్యుపరంగా,వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కానీ ఇది వచ్చినట్లయితే చిన్నవయస్సులోనే బీటా కణాలనేవి నశిస్తాయి. ఈ షుగర్ ముఖ్యంగా 12 నుంచి 25ఏళ్ల వారికే ఎక్కువగా వస్తుంది. ఇది వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

టైప్ -2 డయాబెటీస్:
ఇక టైప్ -2 డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ ఉపయోగించలేని పరిస్థితి కలుగుతుంది. అంటే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని కంట్రోల్లో ఉంచడం చాలా కష్టం. ఈ రకమైన డయాబెటీస్ రోగుల్లో తరచుగా ఆకలి,మూత్రవిసర్జన, దాహం లాంటి లక్షణాలుకనిపిస్తాయి. ఈ రకమైన డయాబెటీస్ ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. అంటే 15ఏళ్ల కంటే తక్కువగా ఉండే పిల్లలకే ఇది సోకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే ఎక్కువ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

టైప్-1డయాబెటీస్ లక్షణాలు:
టైప్ -1 డయాబెటీస్ రోగుల్లో రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీంతో తరచుగా వీరు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం,అధిక ఆకలి, భరించలేని అలసట, గాయాలు సంభవించినప్పుడు తొందరగా నయం కాకపోవడం ఇవి ఈ రెండు రకాల డయాబెటీస్ రోగుల్లో కనిపించే లక్షణాలు. అసౌకర్యం,మూడ్ స్వింగ్స్, బరువు తగ్గడం,తిమ్మిర్లు, అవయవాల్లో వణుకు వంటి లక్షణాలుకూడా ఉండే అవకాశం ఉంటుంది.

టైప్-2 డయాబెటీస్ లక్షణాలు:
టైప్ -2 డయాబెటీస్ లక్షణాలు అంత ఈజీగా బయటపడవు. వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలసిపోయినట్లు కనిపిస్తాయి. కంటి చూపు కూడా మందగిస్తుంది. మసకమసకగా అనిపిస్తుంది. తీవ్రమైన తలనొప్ప సమస్యలు వస్తాయి. తరచుగా మూత్రవిసర్జనచేయడం వల్ల దాహం ఎక్కువగా అవుతుంది. ఈ రోగుల్లో రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపు మందగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఈ రోగం ముదిరి అనారోగ్యం పాలైనప్పుడు కనిపిస్తాయి.