Site icon HashtagU Telugu

Tattoo Vs Blood Donation : టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా ?

Tattoos Linked Cancer Risk

Tattoos Linked Cancer Risk

Tattoo Vs Blood Donation : టాటూ వేయించుకోవడం అంటే చాలామందికి మహా ఇష్టం.. 

అయితే టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా ?  

టాటూ వేయించుకున్నాక రక్తదానం ఎంతవరకు సురక్షితం ?

దీనిపై నిపుణుల అభిప్రాయం ఏమిటి ? 

టాటూ వేయించుకునే ట్రెండ్ యూత్ లో వేగంగా విస్తరిస్తోంది. అయితే టాటూల విషయంలో చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా ?  చేయరాదా ?(Tattoo Vs Blood Donation) అనే ప్రశ్న కూడా వాటిలో ఒకటి. ఇప్పుడు దీనికి వైద్య నిపుణుల సమాధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  రక్తదానం మహాదానం. ప్రపంచవ్యాప్తంగా  ప్రతి 2 సెకన్లకు ఒక వ్యక్తికి రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో మనం చేసే రక్తదానం ఎంతోమంది ప్రాణాలను  నిలుపుతుంది. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి, క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న వారికి, రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారికి దాతల రక్తం అవసరం ఉంటుంది. రక్తదానం తగిన స్థాయిలో జరగపోతే ఎంతోమందికి అత్యవసర వైద్య చికిత్సల్లో రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుంది. రక్తదాన కార్యక్రమాల ద్వారా సేకరించే రక్తాన్ని బ్లడ్ బ్యాంక్స్ లో నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైన వారికి అందిస్తుంటారు. రక్తదానం చేసే వారి నుంచి సేకరించిన రక్తాన్ని ఎర్ర కణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ వంటి అనేక భాగాలు చేసి అవసరమైన రూపంలో రోగులకు సమకూర్చుతారు.

రక్తదానం చేయడం వల్ల ప్రయోజనాలివీ 

Also read  : Samantha Tattoo: చైతూను మరిచిపోలేకపోతున్న సమంత, ఒంటిపై మాజీ భర్త టాటూలు ప్రత్యక్షం!

రక్తదానం చేయాలనుకుంటే ఇవి చేయండి 

టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం ఎప్పుడు చేయాలి ?

టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేసే విషయానికొస్తే..  ఆ టాటూను మీరు ఎప్పుడు వేయించుకున్నారు ? అనే అంశాన్ని ముఖ్యంగా పరిగణించాలి. ఒకవేళ మీరు రీసెంట్ గా టాటూ వేయించుకొని ఉంటే రక్తదానం చేయడానికి కనీసం 6 నెలల నుంచి ఒక సంవత్సరం పాటు వేచి ఉండాలి. మీ శరీరంపై కుట్లతో సహా అన్ని ఇతర నాన్ మెడికల్ ఇంజెక్షన్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇలా ఎందుకు ? అని అంటే..  మన శరీరంపై సిర, లోహం లేదా ఏదైనా ఇతర బయటి పదార్థాన్ని ఉపయోగించడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. హానికరమైన వైరస్‌ లు శరీరంలోకి చొరబడే రిస్క్ పెరుగుతుంది. ప్రత్యేకించి మీరు అపరిశుభ్రమైన సూదితో టాటూ వేయించుకొని ఉంటే ఈ రిస్క్ ఇంకా పెరుగుతుంది. సూది ద్వారా వైరస్ లు  రక్తంలోకి సంక్రమించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, HIV వైరస్ లు కూడా సోకే గండం ఉంటుంది.

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను మెడికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, అధ్యయన నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.