PM Modi – Chandrayaan 3 : మూన్ ల్యాండింగ్ ను ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా నుంచి ఇలా వీక్షిస్తారట !

PM Modi - Chandrayaan 3 : ఇవాళ చంద్రయాన్-3 మిషన్ లో కీలక ఘట్టమైన ల్యాండింగ్ జరగబోతున్న వేళ  .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Pm Modi Chandrayaan 3

Pm Modi Chandrayaan 3

PM Modi – Chandrayaan 3 : ఇవాళ చంద్రయాన్-3 మిషన్ లో కీలక ఘట్టమైన ల్యాండింగ్ జరగబోతున్న వేళ  .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఉన్నారు. బ్రిక్స్ కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.  ప్రధాని మోడీ అక్కడి నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ఘట్టాన్ని ఎలా వీక్షించబోతున్నారనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. సౌతాఫ్రికా నుంచే ఆయన వర్చువల్ గా ల్యాండింగ్ ను వీక్షించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇస్రో అధికారులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అయితే ఈ దేశాలన్నీ తమ రోవర్లను చంద్రుడి ఉత్తర ధ్రువం మీద దించాయి. ఒకవేళ మన  చంద్రయాన్-3 సక్సెస్ అయితే… చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డును  సాధిస్తుంది.

Also read : Chandrayaan3 – Gadwal Techie : చంద్రయాన్-3లో తెలుగు తేజం.. సాఫ్ట్ వేర్ టీమ్ లో గద్వాల్ టెకీ

గతంలోకి వెళితే..

గతంలోకి వెళితే.. 2019 సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ల్యాండింగ్ ను వీక్షించేందుకు ప్రధాని మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో సెంటర్ కు వెళ్లారు. అయితే అప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై  క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో యావత్ దేశం నిరాశకు గురైంది. అప్పటి ఇస్రో చీఫ్ కె.శివన్ ఆవేదనను తట్టుకోలేక ప్రధాని (PM Modi – Chandrayaan 3) ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయనను ప్రధాని మోడీ ఓదార్చారు. మనం ఫెయిల్ కాలేదని… చంద్రుడిని ముద్దాడాలన్న మన ఆకాంక్ష మరింత బలపడిందని ఆ సందర్భంగా ప్రధాని ధైర్యం చెప్పారు.

Also read : Chandrayaan – 3 Landing in 4 Stages : చివరి 17 నిమిషాలలో.. 4 దశల్లో ల్యాండింగ్.. వివరాలివీ

  Last Updated: 23 Aug 2023, 11:44 AM IST