Towels: టవల్స్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే గజ్జి, తామర రోగాలు?

మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అలాగే తిన్న తర్వాత తుడుచుకోవడం కోసం టవల్ ని ఉపయోగిస్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 11:46 AM IST

మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అలాగే తిన్న తర్వాత తుడుచుకోవడం కోసం టవల్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మనం ప్రతి రోజు తుడుచుకునే టవల్ మీద ఎన్నో రకాల సూక్ష్మ కేములు ఉంటాయట. మనం స్నానం చేసిన తర్వాత లేదంటే చేతులు కడుక్కున్న తర్వాత టవల్ తుడుచుకున్నప్పుడు మన ఒంటిపై ఉండే కొన్ని సూక్ష్మ క్రిములు ఆ టవల్ కు అంటుకుంటాయి. అయితే మన ప్రతిరోజు ఉపయోగించే టవల్స్ ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? టవల్ నీ పూర్తిగా ఆరిన తర్వాతే వాడాలా? ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మన ముఖం కడుక్కున్న తర్వాత లేదంటే స్నానం చేసిన తరువాత తుడుచుకునే టవల్ ను కనీసం వారానికి మూడుసార్లు అయినా ఉతకాలి. ఎందుకంటే మనం తుడుచుకున్నప్పుడు మన శరీరంపై ఉండే మృత కణాలు బ్యాక్టీరియా టవల్స్ పైకి చేరుతాయి. అయితే ఆ తర్వాత మళ్లీ మనం తిరిగి అదే టవల్ తో తుడుచుకున్నప్పుడు మళ్లీ శరీరం పైకి వచ్చి చేరతాయి. ఇలా చేయడం వల్ల గజ్జి,తామర ఇలాంటి వ్యాధులను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన నిత్యం ఉపయోగించే టవల్స్ ని రెండు రోజులకు ఒకసారి,వారానికి మూడుసార్లు ఉతకడం వల్ల ఇటువంటి వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు.

మృత కణాలు తేమ సూక్ష్మజీవులకు ఆహారంగా మారి వాటి పెరుగుదలకు దోహదపడి అవి మరింత రెట్టింపు అవుతాయి. అదేవిధంగా టవల్ తడిగా ఉన్న మురికిగా ఉన్న దానిని ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లు చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇంటిల్లిపాది ఒకే టవల్ ను వాడితే ఆ ప్రమాదం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టవల్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే డెడ్ స్కిన్ టవల్ మీద పేరుకు పోతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇవి నిజం.