Cool Drinks: కూల్ డ్రింక్స్ వ్యాపారంలో స్వదేశీ విప్లవానికి రిలయన్స్ రెడీ..!

కూల్ డ్రింక్స్ (Cool Drinks) మార్కెట్ పై పట్టు సాధించాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. పెప్సి, కోకా కోలాలను సవాలు చేయడానికి Campa డ్రింక్స్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోంది. లోకల్ బ్రాండ్ గా దీనికి ప్రజల్లో క్రేజ్ ను పెంచేందుకు ప్లాన్స్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 09:06 AM IST

కూల్ డ్రింక్స్ (Cool Drinks) మార్కెట్ పై పట్టు సాధించాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. పెప్సి, కోకా కోలాలను సవాలు చేయడానికి Campa డ్రింక్స్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోంది. లోకల్ బ్రాండ్ గా దీనికి ప్రజల్లో క్రేజ్ ను పెంచేందుకు ప్లాన్స్ చేస్తోంది. కాంపా డ్రింక్స్ 1970, 1980లలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చక్కెర సోడాలను విడుదల చేసింది. అయితే అప్పటికే పెప్సి, కోకా కోలాలను అమెరికా కంపెనీలు రాష్ట్రంలో విస్తరించాయి. అయితే అప్పట్లో వాటిని కాంపా డ్రింక్స్ నిలువరించలేక పోయింది. అయినా ఆత్మవిశ్వాసం, లోకల్ బ్రాండ్ ట్యాగ్ లతో ఈసారి మళ్లీ కాంపా డ్రింక్స్ ను జనంలోకి రిలయన్స్ తీసుకొస్తోంది.

■ తొలుత హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాల్లో

కాంపాను తయారు చేసేందుకు సొంతంగా లేదా జాయింట్ వెంచర్‌గా కొన్ని ఫ్యాక్టరీలను తెరవాలని రిలయన్స్ నిర్ణయించింది. కాంపాను తొలుత హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో కంపెనీ స్టోర్‌లలో కాంపా ధరలను భారీగా తగ్గిస్తోంది. దుకాణాల్లో 2 లీటర్ల క్యాంపా కోలా బాటిల్ ధర 49 రూపాయలు . దాని లేబుల్ ధరపై దాదాపు 50% తగ్గింపు ఉంటుంది. 2.25 లీటర్ల కోక్ , పెప్సీల కంటే దీని ధర దాదాపు మూడింట ఒక వంతు తక్కువ.  కాంపా కోలా, కోక్ అతి చిన్న సీసాల ధర 10 రూపాయలే. కానీ పెప్సీ ధర 12 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: 240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?

■ టార్గెట్ ఐపీఎల్

రిలయన్స్ రాబోయే ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కాంపాను పెద్దఎత్తున అడ్వర్టైజ్ చేయాలని భావిస్తోంది. కాంపాను వారి రిఫ్రెష్‌మెంట్ భాగస్వామిగా చేయడానికి కనీసం 3 జట్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

■’గ్రేట్ ఇండియన్ టేస్ట్’ vs విదేశీ బ్రాండ్లు

రిలయన్స్ కూల్ డ్రింక్స్ విభాగాన్ని గతంలో కోకా-కోలాలో దాదాపు 17 సంవత్సరాలు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ టి. కృష్ణకుమార్ నడుపుతున్నారు. “గ్రేట్ ఇండియన్ టేస్ట్” మరియు “రిచ్ హెరిటేజ్”తో కాంపాను స్వదేశీ బ్రాండ్‌గా ప్రచారం చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు.700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.