ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీగా పేరొందిన మిస్ వరల్డ్ 2025 (MISS WORLD 2025)పోటీలో ఈ సారి మొత్తం 108 మంది అందగత్తెలు (Beauties) తమ అందం, ప్రతిభను ప్రదర్శించేందుకు బరిలో దిగారు. వివిధ దేశాలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సుందరీమణులు విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకోవాలని ఆశతో పోటీపడుతున్నారు. ఈ పోటీ అనేక దశలుగా జరగనుండగా, ప్రతి దశలో మెరుగైన ప్రతిభ కనబరిచినవారికే తరువాతి దశలోకి ప్రవేశం లభిస్తుంది.
Mango Leaves: శరీర బరువును తగ్గించే మామిడి ఆకులు.. వీటిని ఎలా ఉపయోగించాలంటే?
ఈ 108 మందిని ఖండాలవారీగా ఆఫ్రికా, అమెరికా-కరేబియన్, యూరప్, ఆసియా-ఓషియానా అనే నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈ ప్రతి ఖండం నుంచి ప్రారంభంగా 10 మంది ప్రతిభావంతుల్ని క్వార్టర్ ఫైనల్స్‌కి ఎంపిక చేస్తారు. వీరికి ఫిట్‌నెస్, టాలెంట్, బ్యూటీ విత్ పర్పస్, ఇంటర్వ్యూలు వంటి విభాగాల్లో పరీక్షలు ఉంటాయి. ఈ పోటీలు గట్టి పోటీలో జరుగుతుండటంతో, ఒక్కొక్కరికి తమను నిరూపించుకోవాల్సిన అవసరం పెరిగింది.
ఫైనల్ గా ఒక్కో ఖండం నుంచి ఒకరే ఫైనల్‌కు ఎంపికవుతారు. ఈ విధంగా మొత్తంగా నలుగురు ఫైనలిస్టులు తుది పోటీలో తమ ప్రతిభను చూపించనున్నారు. చివరి దశలో వీరిలో ఎవరు అన్ని అంశాల్లో అత్యుత్తమంగా నిలుస్తారో వారికే మిస్ వరల్డ్ కిరీటం లభిస్తుంది. ఈసారి పోటీలు మరింత ప్రతిష్టాత్మకంగా, ప్రతిభా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతున్నాయి. అందుకే ఎవరు విజేతగా నిలుస్తారో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.