Site icon HashtagU Telugu

HYD : లక్డీకాపూల్ ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిని ఆసుపత్రి పాలైన గృహిణి

Carrot Halwa

Carrot Halwa

ప్రస్తుతం సిటీ జనాలంతా హోటల్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఇంట్లో వంట చేసుకోవడం మానేసి..రోడ్ సైడ్ , హోటల్ ఫుడ్ ను ఎక్కువగా తింటుండడం తో నగరం లో వేలసంఖ్యలో హోటల్స్ కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ హోటల్స్ దగ్గరి నుండి చిన్న చిత హోటల్స్ వరకు ఆహార భద్రత నియమాలను పాటించకుండా నడుపుతుండడంతో ఈ హోటల్స్ లలో ఫుడ్ తిన్న వారంతా హాస్పటల్ పాలవుతున్నారు. తాజాగా హైదారాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా కుళ్ళిపోయిన క్యారెట్, పెసర పప్పు హల్వా తిని ఓ గృహిణి తీవ్ర అస్వస్థకు గురైంది. ఈ ఘటన లక్డీకాపూల్ ద్వారకా హోటల్‌ లో జరిగింది. మాల్కాజిగిరికి చెందిన శ్రీధర్, స్రవంతి దంపతులు.. గురువారం 3.30 గంటల ప్రాంతంలో లక్డీకాపూల్ ద్వారకా హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి, క్యారెట్, పెసర పప్పు హల్వా తీసుకున్నారు. భోజనంలోనే కొంచెం తేడా అనిపిస్తే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చి హల్వా ప్యాక్ చేసారు. ఇంటికి చేరుకొని హల్వా తిందామని ప్యాకెట్ తెరవగానే ఒక రకమైన దుర్వాసన వచ్చింది. దానిని నోట్ల పెట్టగానే వాంతులు అయి స్రవంతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే హోటల్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారు దురుసుగా మాట్లాడటంతో పాటు వ్యగ్యంగా తిట్టారు. దీంతో బాధితురాలు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కుళ్ళిపోయిన హల్వాను తీసుకుని ఎఫ్ఐఆర్ 221/2024 కింద సెక్షన్ 273, 337 కింద అభియోగాలను నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు.

ఇక మంగళవారం సోమాజిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో హోటళ్లపై ఫుట్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో హోటళ్ల డొల్లతనం బయటపడింది. సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్, ఓ బార్, కేఎఫ్‌సీల్లో నిబంధనలను వైలెట్ చేశాయి.

Read Also : Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ మద్దతు