Manipur Naked Parade : మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం వైరల్ కావడంతో దానికి రియాక్షన్ మొదలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హుయిరేమ్ హెరోదాస్ మైతై ఇంటిని పలువురు ఆందోళనకారులు తగులబెట్టారు. పెద్దఎత్తున మహిళలతో కూడిన నిరసనకారుల బృందం ఒక్కసారిగా వచ్చి..నిందితుడి ఇంటికి నిప్పుపెట్టి వెళ్ళిపోయింది.
Also read : Espresso Coffee Vs Alzheimers : ఈ కాఫీ తాగితే అల్జీమర్స్ కు ఆదిలోనే అడ్డుకట్ట!
ఇంతకీ ఏమిటీ ఘటన ?
మే 4న మధ్యాహ్నం 3 గంటలకు మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంపై దాదాపు 1000 మంది దుండగులు ఆయుధాలతో దాడి చేశారు. ఇళ్లను ధ్వంసం చేసి, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటసామాగ్రి, బట్టలు, రేషన్, పశువులు, పెంపుడు జంతువులను దోచుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరిలో ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారని కథనాలు వస్తున్నాయి. అయితే ఆనాటి వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కూడా ఈవివరాలను ధృవీకరించారు. దీనిపై కాంగ్‌పోక్‌పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు చెబుతున్నారు. ఇద్దరు బాధిత మహిళలు కుకి-జోమి వర్గానికి చెందినవారని అంటున్నారు. బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు 32 ఏళ్ల హుయిరేమ్ హెరోదాస్ మైతై ను తౌబుల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. మైతాయ్ కమ్యూనిటీకి చెందిన కొందరు సభ్యులే మహిళలను నగ్నంగా తీసుకెళ్తూ వీడియోలు తీశారని కుకీ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీఎల్‌ఎఫ్ ఆరోపిస్తోంది.
Also read : King Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ..!