Siddipet : ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌లో హాస్ట‌ల్ వార్డెన్‌, వంట‌మ‌నిషిపై వేటు

  • Written By:
  • Updated On - June 30, 2022 / 08:46 AM IST

సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్ట‌ల్ లో పుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై అధికారులు చ‌ర్య‌లు ప్రారంభించారు.రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, బాలికల జూనియర్‌ కళాశాల డిప్యూటీ హాస్టల్‌ వార్డెన్‌ రజియా సుల్తానా, ఇద్దరు కుక్‌లు దుర్గ, నాగరాణిలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశారు. . ప్రిన్సిపాల్ శ్రీలతను కూడా సొసైటీ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. హాస్టల్‌లో జూన్ 26న మధ్యాహ్న భోజనం చేసి 300 మంది విద్యార్థుల్లో 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. ఘటనకు బాధ్యులైన హాస్టల్ సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో చికెన్‌, వంకాయల కూర తినడంతో విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, కదలికలు వచ్చాయి. వీరిలో 20 మందిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థులంతా పూర్తిగా కోలుకున్నారు.