Site icon HashtagU Telugu

Ukraine : ఇజియంలో రష్యా నరమేధం.. సామూహిక ఖనానికి సంబంధిచిన భయానక ఫొటోలు వైరల్..!!

Ukraine

Ukraine

ఉక్రెయిన్ లో రష్యా దళాలు స్రుష్టించిన అరాచకాలు ఒక్కోక్కొటిగా బయటపడుతున్నాయి. ఈశాన్య నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న తర్వాత..నగరానికి సమీపాన సమాధులను గుర్తించారు. దాదాపు 440 మృతదేహాలను పాతిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమాధిని ఉక్రెనియన్ దళాలు ఖార్కివ్ ప్రాంతాంలోని ఇజియం సమీపంలో కనుగొన్నారు. సామూహిక ఖనానికి సంబంధించిన భయానక ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా అకృత్యాలకు పాల్పడిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు ఖార్కివ్ ప్రాంతంలో ఉక్రేనియన్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ అయిన సెర్గీ బోల్వినోవ్ మాట్లాడుతూ, కైవ్ దళాలు..వెళ్లిన తర్వాత ఇజియం సమీపంలో 440 కంటే ఎక్కువ మృతదేహాలు ఉన్న గొయ్యిని గుర్తించినట్లు చెప్పారు. కొంతమందిని కాల్చి చంపిన సమాధి చేసినట్లు తెలిపారు. అందులో చాలా మృతదేహాలను ఇంకా గుర్తించలేదని బోల్వినోవ్ తెలిపారు.

https://twitter.com/FreeCiviliansUA/status/1570550988796469249?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570550988796469249%7Ctwgr%5E6a7e929d70d140a1aac98c8d9fce2ce97b254193%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fnews%2Fworld%2Fnew-mass-grave-ukraine-izium-over-440-bodies-found-disturbing-pictures-from-site-go-viral-5634088%2F