Site icon HashtagU Telugu

Bihar: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి

Bihar

Bihar

Bihar: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్‌కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.

బీహార్‌లోని ససారం ప్రాంతం నుంచి వారణాసి వైపు నిన్న రాత్రి స్కార్పియో కారు వెళ్తోంది. దేవ్‌కలి గ్రామ సమీపంలోని మోహనియా ప్రాంతంలో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అలాగే కారు అదుపు తప్పి రాంగ్ డైరెక్షన్‌లో రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్ మీదుగా వెళ్లి అటుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తొమ్మిది మంది మృతి చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: Anant Ambani Wedding : అనంత్ అంబానీ పెళ్లి.. 5 స్టార్ హోటళ్లు లేవని ఏం చేశారో తెలుసా?