Site icon HashtagU Telugu

Honour killing : పరువు హత్య..నడిరోడ్డుపై ఇద్దరు మైనర్ల గొంతుకోసి దారుణంగా…!!ఎక్కడంటే..!!

Murder

Murder

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్ నడిరోడ్డు ఇద్దర్ని దారుణంగా హత్య చేశారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ పన్నా జిల్లాలో సోమవారం ఓ యువకుడు, బాలిక హత్యకు గురయ్యారు. బాలిక తొమ్మిదవ తరగతి విద్యార్థిని. అబ్బాయి వయస్సు 18 ఏళ్లు. రోడ్డుపై వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి వెనక నుంచి పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిలిద్దరూ ఒకే కులానికి చెందినవారని..పరిస్థితులను గమనిస్తుంటే పరువు హత్యగా అనిపిస్తుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిది ప్రేమ వ్యవహారామా లేదా ప్రేమను నిరాకరించినందుకు ఇలా చేశారా..లేదా కుటుంబ సభ్యులు చేశార అనేది ఇంకా స్పష్టత రాలేదు.