Honey Trap: దేశంలో హనీట్రాప్ ప్రకంపనలు

దేశంలో హనీట్రాప్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ట్రాప్ లో ఇప్పటికే పలువురు చిక్కుకుని మోసపోయారు. మరీ ముఖ్యంగా హనీట్రాప్ బాధితుల్లో ప్రముఖులు కూడా విశేషం.

Published By: HashtagU Telugu Desk
Honeytrap

Honeytrap

Honey Trap: దేశంలో హనీట్రాప్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ట్రాప్ లో ఇప్పటికే పలువురు చిక్కుకుని మోసపోయారు. మరీ ముఖ్యంగా హనీట్రాప్ బాధితుల్లో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. అందమైన మహిళలు ఈ పనికి పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇదేదో కేవలం ఒకరు చేసే పని కాదు. దీని వెనుక పెద్ద సామ్రాజ్యమే ఉందని అభిప్రాయపడుతున్నారు పోలీస్ అధికారులు. ఇదిలా ఉండగా తాజాగా మరో హనీట్రాప్ కేస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

అండర్‌కవర్ ఐఏఎస్‌గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్, సుల్తాన్‌పూర్‌కు చెందిన కల్పనా మిశ్రా.. ఫేస్‌బుక్‌లో కొందరికి వల వేస్తుంది. వాళ్ళతో ముందు తన తియ్యని మాటలతో స్నేహం చేస్తుంది. ఆ తరువాత పర్సనల్ విషయాలకు వస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి అన్నీ తెలుసుకుని ప్రేమ అంటూ మొదలుపెడుతుంది. అలా ఆమె ఓ వ్యక్తిని ట్రాప్ చేసింది. ఆమె ఉచ్చులో చిక్కుకున్న వ్యక్తి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. సమాజంలో తమ పరువు పోతుందన్న భయంతో బాధితులు పోలీసుల ముందుకు రావడం లేదు. కల్పన స్వయంగా అతనికి పెళ్లి ప్రపోజ్ చేసింది. వ్యక్తి ఒప్పుకోకపోవడంతో తనవద్ద భారీగా డబ్బు డిమాండ్ చేసింది. దీంతో ఆ వ్యక్తి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌కి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. అనంతరం అభియోగాలు నమోదు చేశారు.

కల్పనా మిశ్రా సోషల్ మీడియా ఖాతాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఆమె ఎంతమందిని మోసం చేసిందో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ సాగే ఈ గేమ్‌లో ఆమె వెనుక ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది.

Read More: Asia Cup: ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆసియా కప్ కు డౌటే..?

  Last Updated: 25 Jun 2023, 10:58 AM IST