Honey Trap: హనీట్రాప్ లో ఇరుక్కుంటున్న యువత

హనీట్రాప్ కేసులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ ట్రాప్ లో యువత మాత్రమే కాదు 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులు సైతం ఇరుక్కున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో హనీట్రాప్ కేసు ఒకటి వెలుగు చూసింది.

Published By: HashtagU Telugu Desk
Honey Trap

New Web Story Copy 2023 06 17t202445.101

Honey Trap: హనీట్రాప్ కేసులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ ట్రాప్ లో యువత మాత్రమే కాదు 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులు సైతం ఇరుక్కున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో హనీట్రాప్ కేసు ఒకటి వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్ లోని బిల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో హనీట్రాప్ ఒకటి చోటు చేసుకుంది. ఖైరీ గ్రామానికి చెందిన నర్సింగ్ హోమ్ వర్కర్ హనీ ట్రాప్‌కు గురయ్యాడు. నగ్నంగా తన వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా యువకుడికి కాల్స్ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో మనోవేదనకు గురైన యువకుడు బిల్సీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

వివరాలలోకి వెళితే.. ఖైరీ నివాసి అమీర్ బిల్సీలోని నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అతని మొబైల్‌కి ఓ అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ లో ఆ యువతీ నగ్నంగా ఉన్నది. దీంతో ఆ వ్యక్తి వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ సమయంలోనే ఆ కిలాడీ వీడియో కాల్ కు సంబంధించి స్క్రీన్ షాట్స్ తీసుకుంది. ఇంకేముంది ఆ స్క్రీన్ షాట్స్ ఆ యువకుడికి పంపి బ్లాక్ మెయిల్ కి పాల్పడింది. కలత చెందిన అతను ఆమె నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు యువకులు వేర్వేరు నంబర్ల నుంచి అతనికి ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలను బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More: Wrestlers Protest: పదేళ్లుగా మహిళ రెజ్లర్లపై లైగిక వేధింపులు: వైరల్ వీడియో

  Last Updated: 17 Jun 2023, 08:25 PM IST