Site icon HashtagU Telugu

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ‘తేనెటీగల’ దాడి!

Sharmila

Sharmila

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాదయాత్రకు పలు అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. ముందుకుసాగుతున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు.. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు.. అయితే, వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇవాళ తేనెటీగలు దాడి చేశాయి.

మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు షర్మిల. ఇదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తన సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో.. తేనెటీగల దాడి నుంచి వైఎస్‌ షర్మిల బయటపడ్డారు. వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ రోజు 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.

Exit mobile version