Site icon HashtagU Telugu

Karnataka : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు

Rains Students

Rains Students

కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో బెళగావి, చిక్కమగళూరు, హాసన్ జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వర్ష ప్రభావిత జిల్లాల నుండి జిల్లాల కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వ‌హించారు. భారీ వర్షాల కారణంగా బెలగావి జిల్లాలో రెండు రోజుల పాఠశాలలకు జిల్లా కమీషనర్ నితీష్ పాటిల్ సెలవు ప్రకటించారు. కృష్ణానది పొంగి పొర్లుతుండడంతో నది ఒడ్డున ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. చిక్కమగళూరు, కొడగు, హాసన్ జిల్లాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం వరకు భారీ వర్షాలకు రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు కోల్పోగా, కర్ణాటక వ్యాప్తంగా 14 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి, కొడగు నాలుగు కోస్తా జిల్లాల్లో ఈ ఏడాది జూలైలో అదనపు వర్షాలు కురిశాయి. ఉత్తర కర్ణాటక జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.