భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని విద్యాసంస్థలకు ఈ రోజు(బుధవారం)సెలవు ప్రకటించింది. అన్ని విద్యాసంస్థలు గురువారం తిరిగి ప్రారంభమవుతుతాయి. జిల్లా యంత్రాంగం మంగళవారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, నిర్ణయంలో ఇంకా ఏవైనా మార్పులు ఉంటే బుధవారం తెలుపుతామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జూలై 25 ఉదయం 8 గంటల నుండి జూలై 26 ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 130.5 మిమీ వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
Heavy Rains : వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

Rains Students