Site icon HashtagU Telugu

Holi Celebrations: హైదరాబాద్ లో ఘనంగా హోలీ.. జోరుగా రెయిన్ డ్యాన్సులు

Holi1

Holi1

Holi Celebrations: పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. సహజ రంగులు పూసుకుంటూ హ్యాపీ హోలీ అంటు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో విద్యార్థులు, స్నేహితులు, యూత్ అంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారుహైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో గడ్చిబౌలి సంధ్యా ఫుడ్ కోర్టులో ఘనంగాతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన ‘కంట్రీ క్లబ్ హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు.హోలీ అంటే చాలు పిల్లలు, పెద్దలు ఎగిరి గంతేస్తారు. రంగులతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే. రంగులను ఒకరికి ఒకరు పూసుకో వడం, రంగునీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం, డీజే పాట లకు నృత్యాలు చేస్తుండటం ప్రతీ ఒక్కరికి సరదా. పండగ వేళ రంగులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలురకాల రంగు లను కొనిస్తారుముందు రోజు నుంచే హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ స్టార్స్ హోలీ సంబురాలు జరుపుకుంటూ అభిమానులను ప్రత్యేకంగా విష్ చేస్తున్నారు.

Exit mobile version