Site icon HashtagU Telugu

Hizbul terrorists: కర్నాటకలో హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు అరెస్టు…అప్రమత్తమైన అధికారులు..!!

దేశంలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద చర్యలు తగ్గాయి. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రకార్యకలాపాలు మొదలయ్యాయని పలు రిపోర్టులు వెల్లడించాయి. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి దేశంలోకి టెర్రరిస్టులు చొరబడి పెద్దెత్తున విధ్వాంసాలకు పాల్పడే అవకాశం ఉందని రిపోర్టులు అంచనా వేస్తున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తం అయ్యింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా మారువేషంలో తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని గుర్తించి అరెస్టు చేయడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కర్నాటకలో ఇప్పటికే హిందూ-ముస్లింలకు సంబంధించిన పలు వివాదాలు వరసగా చోటుచేసుకోవడంతోపాటు…ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్లాటూన్లతోపాటు స్థానిక బెంగుళూరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.

ఈనెల 3న ఈ ఆపరేషన్ నిర్వహించగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాది రెండేళ్లుగా బెంగుళూరులో తలదాచుకున్నాడు. అరెస్టు అయిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థఖు చెందిన కీలక వ్యక్తుల్లో ఒకరై హుస్సేన్ గా గుర్తించారు. 2016 ఉగ్రవాద సంస్థలో చేరిన హుస్సేన్ కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో బెంగుళూరు వచ్చిన హుస్సెన్ సాధారణ మనిషిలా ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హుస్సేన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సాయుధ బలగాలు హుస్సెన్ బెంగుళూరులో ఉన్నట్లు సమాచారం సేకరించారు. దీంతో అతని కదలికలపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. హుస్సెన్ అరెస్ట తర్వాత అతను టెర్రరిస్టు అని తెలిసి స్థానికులు షాక్ కు గురయ్యారు.