Site icon HashtagU Telugu

Hyderabad: ముందు.. అమిత్‌ షా పేరులో ‘షా’ తీసేయాలి

Template (20) Copy

Template (20) Copy

హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్‌ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్‌ పాండురంగారెడ్డి సవాల్‌ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ నాయకులు ధరించకూడదని అన్నారు.

దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘హైదరాబాద్‌ ఫరెవర్‌.. ట్రుత్‌ వర్సెస్‌ మిత్‌’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. నగరాన్ని అభివృద్ధి చేస్తామనడానికి బదులు పేర్లు మారుస్తామంటూ బీజేపీ మాట్లాడటం సరికాదని విమర్శించారు.