Site icon HashtagU Telugu

Siddipet: 600 కోట్ల పెట్టుబ‌డితో కోకాకోలా బేవ‌రేజ‌స్‌

Cocacola

Cocacola

భారతదేశంలోని అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసిజి కంపెనీల్లో ఒకటైన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ తెలంగాణలో ఇన్వెస్టిమెంట్ చేయ‌నుంది. దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీ పెట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోనే రెండో ఫ్యాక్టరీని సిద్దిపేటలోని బండతిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. HCCB ఫ్యాక్టరీ 2023 చివరి నాటికి వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇప్పటికే ఫుడ్ పార్క్ వద్ద 48.53 ఎకరాలను కేటాయించింది. వాట‌ర్‌, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో కెపాసిటీ బిల్డింగ్, ఉపాధిని ప్రోత్సహించడానికి స్కిల్ బిల్డింగ్ కోసం కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది.

Exit mobile version