Valimai Trailer: ‘వాలిమై’ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా అజిత్‌ 'వాలిమై' తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ 'వాలిమై'

  • Written By:
  • Updated On - February 10, 2022 / 11:58 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా అజిత్‌ ‘వాలిమై’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థలు. సంయుక్తంగా బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో ఈ రోజు (10.2.2022) సాయంత్రం 6:30 గంటలకు తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ: “తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం. వాలిమై తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసాము. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం ఉంటుంది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియ‌న్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. అన్నారు.
ఈ చిత్రం లో నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మడకొండ, హ్యుమా ఖురేషి, గుర్బాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి ఎం సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :
నిర్మాణ సంస్థలు: బే వ్యూ ప్రాజెక్ట్స్ L L P, జీ స్టూడియోస్,
నిర్మాత: బోనీ కపూర్,
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఎచ్ వినోద్,
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, జిబ్రాన్,
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా,
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి,