Hindenburg Blasting: హిండెన్‌బర్గ్ బ్లాస్టింగ్ : త్వరలో మరో పెద్ద సంచలన రిపోర్ట్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో దడ పుడుతోంది. ఇంతకుముందు అదానీ గ్రూప్ ను అతలాకుతలం చేసే రిపోర్ట్ రిలీజ్ చేసిన..

హిండెన్‌బర్గ్ (Hindenburg) రీసెర్చ్ రిపోర్ట్ అంటే.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో దడ పుడుతోంది. ఇంతకుముందు అదానీ గ్రూప్ ను అతలాకుతలం చేసే రిపోర్ట్ రిలీజ్ చేసిన హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ.. ఇప్పుడు మరో పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం కలకలం రేపుతోంది. దీంతో నెక్స్ట్ ఎవరు ? ఏ కంపెనీ ? అనే దానిపై తీవ్ర సస్పెన్స్ నెలకొంది. ఈసారి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎవరిని టార్గెట్ చేయనుంది అనే దానిపై సోషల్ మీడియాలోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది.

ఏమిటీ రీసెర్చ్ రిపోర్ట్?

నేట్ ఆండర్సన్ అనే వ్యక్తి న్యూయార్క్ కేంద్రంగా నడుపుతున్న షార్ట్ సెల్లింగ్ కంపెనీ పేరే హిండెన్‌బర్గ్ (Hindenburg) రీసెర్చ్. ఈ సంవత్సరం జనవరి 24న బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన వ్యాపారులపై సంచలన నివేదిక విడుదల చేసింది.“అదానీ గ్రూప్: హౌ ది వరల్డ్స్ 3వ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పోరేట్ హిస్టరీ” అనే టైటిల్ ను ఈ రిపోర్ట్ కు పెట్టింది. ఫలితంగా అదానీ కంపెనీల స్టాక్స్ రేట్లు ఘోరంగా పడిపోయాయి. అదానీ గ్రూప్ మరియు కంపెనీల మార్కెట్ విలువ సుమారు ఐదు వారాల్లో 150 బిలియన్లకు పైగా క్షీణించింది. అదానీ గ్రూప్ స్టాక్ ధరల్లో మానిప్యులేషన్ చేసిందని, పన్ను స్వర్గధామాలను తన ప్రయోజనాలకు వాడుకుందని ఆరోపించింది. అదానీ గ్రూప్ లోని 7 ప్రధాన కంపెనీల భారీ లోన్స్ గురించి కూడా ఆందోళనలను లేవనెత్తింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.

ఈనేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ యొక్క రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఓ)ను అదానీ గ్రూప్ రద్దు చేసుకుంది. నివేదిక పేలడంతో.. అదానీ గ్రూప్ తన రుణాన్ని తీవ్రంగా తగ్గించు కోవడంపై దృష్టి పెట్టింది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యయాన్ని తగ్గించే ప్రయత్నంలో కీలక ప్రాజెక్టులకు కంపెనీ విరామం ఇవ్వవలసి వచ్చింది. ఈ నివేదిక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో JPC విచారణను డిమాండ్ చేశాయి.అదానీ- హిండెన్‌బర్గ్ గొడవకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.దీని తర్వాత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు స్వతంత్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇతర పెద్ద నివేదికలు

2020 సెప్టెంబర్ లో ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ నికోలా కార్ప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ (Hindenburg) నివేదికలను విడుదల చేసింది. “నికోలా: హౌ టు పార్లే యాన్ ఓషన్ ఆఫ్” అనే పేరుతో ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఈ నివేదికలో.. నికోలా తన సాంకేతిక పరిణామాల గురించి పెట్టుబడిదారులను మోసగించిందని పేర్కొంది. నికోలా తన ఎలక్ట్రిక్ ట్రక్ అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు చూపుతూ రూపొందించిన వీడియోను ఆండర్సన్ సవాలు చేశాడు . వాస్తవానికి, వాహనం కొండపై దొర్లింది. ఇది నికోలా వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ యొక్క రాజీనామాకు దారితీసింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దాని వెబ్‌సైట్ ప్రకారం కనీసం 17 కంపెనీలలో ఇలాంటి సంభావ్య తప్పులను ఫ్లాగ్ చేసింది.

Also Read:  Criticism on Suryakumar: బలహీనతలు అధిగమిస్తేనే.. సూర్యకుమార్ వన్డే ఫాం పై విమర్శలు