Site icon HashtagU Telugu

Himanshu Gift : కేటీఆర్ కు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్..చూసి వావ్ అనాల్సిందే..!!

Himanshu Singing Gift To Kt

Himanshu Singing Gift To Kt

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) జన్మదినాన్ని (KTR Birthday)పురస్కరించుకుని ఆయన కుమారుడు హిమాన్షు ప్రత్యేక గిఫ్ట్‌(Himanshu Gift) అందించారు. ఈ గిఫ్ట్‌ కేటీఆర్‌నే కాకుండా, నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విడుదలైన యానిమల్‌ (Animal) సినిమాలోని ‘నా సూర్యుడివి… నా చంద్రుడివి’ పాటను హిమాన్షు స్వయంగా పాడి..అది తండ్రికి అంకితమిచ్చారు. పాటలోని భావోద్వేగాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేసిన హిమాన్షు, తన గాత్రంతో పాటకు కొత్త జివం పోశారు. ఒరిజినల్ పాటతో పోలిస్తే హిమాన్షు పాడిన వెర్షన్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా అనిపించింది. ప్రత్యేకంగా, తండ్రితో తనకు ఉన్న జ్ఞాపకాలను తెలియజేస్తూ కొన్ని ఫొటోలను జోడించి వీడియోను రూపొందించడం ఈ గిఫ్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

హిమాన్షు సృజనాత్మకతను చూసి కేటీఆర్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ, “హిమాన్షు వాయిస్ చాలా బాగుంది, నా జీవితంలో ఈ చిన్నవాడి నుండి అందుకున్న మధుర గిఫ్ట్ ఇది” అని పేర్కొన్నారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్‌తో హిమాన్షు సంబంధం ఎంతో ప్రత్యేకమైనది అని ఈ వీడియో స్పష్టం చేసింది. తండ్రి కోసం కుమారుడు ఇంత ప్రత్యేకమైన గిఫ్ట్ అందించడమే కాకుండా, తన ప్రతిభను చూపించాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. హిమాన్షు టాలెంట్‌ను మెచ్చుకుంటూ, తనలో ఉన్న సంగీతప్రతిభను మరింతగా అభివృద్ధి చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. హిమాన్షు ఈ రీతిలో తన తండ్రిని సర్ప్రైజ్‌ చేయడం కేటీఆర్‌ అభిమానులను గర్వపడేలా చేసింది. ఇటువంటి వీడియోలు తండ్రి-కుమారుడి బంధాన్ని మరింత బలపరుస్తాయని, ఇది ప్రతి కుటుంబానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ..