Site icon HashtagU Telugu

Himachal Floods: ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్‌

Himachal Floods

New Web Story Copy 2023 07 11t083543.816

Himachal Floods: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఇళ్ళు నేలమట్టం అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు ప్రమాద అంచుకు చేరాయి. దీంతో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

సోలన్, సిమ్లా, సిర్మౌర్, కులు, మండి, కిన్నౌర్ మరియు లాహౌల్‌లలో రాబోయే 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది కాకుండా వాతావరణ సూచన ప్రకారం రాబోయే 24 గంటలపాటు మండి, కిన్నౌర్ మరియు లాహౌల్-స్పితీకి వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఏడు జిల్లాలను రెడ్ అలర్ట్‌లో ఉంచడంతోపాటు, ఉనా, హమీర్‌పూర్, కాంగ్రా మరియు చంబాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లో రాష్ట్రంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడవచ్చని IMD హెచ్చరికలు జారీ చేసింది.

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశ రాజధానిలో పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రులు, అధికారులు, మేయర్‌లతో సమావేశానికి పిలుపునిచ్చారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ను అలెర్ట్ చేశారు.

Read More: 2 Pawars-Modi Event : ఆగస్టు 1న మోడీ ప్రోగ్రాంకు శరద్ పవార్, అజిత్ పవార్