Site icon HashtagU Telugu

Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు..

Himachal Pradesh

New Web Story Copy

Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆయా చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ లోని మూడు జిల్లాలు సిమ్లా, మండి మరియు సోలన్‌లలో భారీ వర్షాల కారణంగా రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి. గత 24 గంటలుగా మండి జిల్లాలో 323, సిమ్లాలో 234, సోలన్‌లో 93 రోడ్లు స్తంభించాయి. దీంతో ఆయా జిల్లాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మండి, సోలన్, కాంగ్రా, హమీర్‌పూర్, ఉజా జిల్లాల్లో మరికొద్ది రోజులు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4285 ట్రాన్స్‌ఫార్మర్లు నాసిరకంగా ఉండడంతో కరెంట్ సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Also Read: Karnataka Police: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాషాయ జెండా ఎగరేసే ప్రయత్నం