Site icon HashtagU Telugu

Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 15 మంది దుర్మ‌ర‌ణం!

Landslide

Landslide

Landslide: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఝండూత భల్లూ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో (Landslide) ఒక బస్సు మట్టి కింద చిక్కుకుపోయింది. ఈ ఘటనలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఝండూత (Jhandutta) ప్రాంతంలోని బర్తిన్ (Barthin) సమీపంలో ఉన్న ఒక కొండ అకస్మాత్తుగా విరిగిపడటంతో భారీగా మట్టి, శిథిలాలు బస్సుపై పడ్డాయి.

Also Read: Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట!

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు స‌మాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరికొంతమంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

ప్రమాద వివరాలు

Exit mobile version