Space Lab-Govt School : గవర్నమెంట్ స్కూల్ లోనూ స్పేస్ ల్యాబ్..
ఔను.. ఇది నిజమే
స్టూడెంట్స్ కు స్పేస్ సైన్స్ పై ఇంట్రెస్ట్ పెంచడానికి ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నారు..
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లా ఘుమర్విన్ టౌన్ లో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ అది. ఈ గవర్నమెంట్ స్కూల్ లో స్పేస్ ల్యాబ్ (Space Lab-Govt School) నిర్మాణం కోసం జిల్లా మైనింగ్ ఫండ్ నుంచి రూ. 10 లక్షల బడ్జెట్ ను కేటాయించారు. ఇక్కడి విద్యార్థులలో శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించడానికి స్పేస్ ల్యాబ్‌ను నిర్మించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని స్పేస్ ల్యాబ్‌ను అధ్యయనం చేసిన తర్వాత ఈ స్పేస్ ల్యాబ్‌ను నిర్మిస్తున్నామని బిలాస్‌పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ నిధి పటేల్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీని ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ స్పేస్ ల్యాబ్ లో ఉపగ్రహ లాంచర్ సిస్టమ్ లు, డ్రోన్లు, ఇస్రో ప్రాజెక్టుల నమూనాలు కూడా ఉంటాయని తెలిపారు.
Also read : Space: జీరో గ్రావిటీలో పునరుత్పత్తి అధ్యయనం.. స్పేస్ లోకి కోతులను పంపనున్న చైనా?
14 ఏళ్లకే స్పేస్‌ఎక్స్ లో సాఫ్ట్‌వేర్ జాబ్
14 ఏళ్ల బంగ్లాదేశ్ సంతతి కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు.. అది కూడా అలాంటి ఇలాంటి కంపెనీలో కాదు.. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) లో!! SpaceX కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరేందుకు రెడీ అవుతున్న ఆ బాలుడి పేరు కైరాన్ క్వాజీ (Kairan Quazi). 14 ఏళ్ళ ఏజ్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారో మనకు తెలుసు.. ఏదైనా అచీవ్ మెంట్ సాధించాలంటే కనీసం 20 ఏళ్లయినా రావాలనే ఒపీనియన్ చాలామందిలో ఉంటుంది. కానీ అలాంటి సిద్ధాంతాలన్నీ తప్పు అని 14 ఏళ్ల కైరాన్ క్వాజీ(14 Year Software Engineer) నిరూపించాడు. అతడు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాంటాక్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఈక్రమంలో స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్‌లింక్ ఇంజనీరింగ్ బృందంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్స్ ఉన్నాయని తెలియడంతో అప్లై చేశాడు. స్పేస్‌ఎక్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో పాస్ అయ్యాడు. టెక్నికల్ రౌండ్ లో అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కైరాన్ క్వాజీ గడగడా ఆన్సర్స్ చెప్పాడు. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి కావడానికి ముందే.. అతడికి జాబ్ కన్ఫర్మ్ అయింది. త్వరలో ఇంజనీరింగ్ పూర్తయితే.. అతి పిన్న వయస్కుడైన అమెరికా గ్రాడ్యుయేట్‌గా కూడా అతడు చరిత్ర సృష్టిస్తాడు.