Doctors’ Handwriting: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్.. కడుపుబ్బా నవ్విస్తున్న ఆనంద్ మహీంద్రా వీడియో!!

దేశంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పారిశ్రామికవేత్త ఎవరైనా ఉన్నారంటే.. అది ఆనంద్ మహీంద్రా. ట్విట్టర్ లో సరికొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ..ప్రజలను ఆలోచింపజేయడంలో ఆయనకు ఆయనే సాటి.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 07:15 AM IST

దేశంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పారిశ్రామికవేత్త ఎవరైనా ఉన్నారంటే.. అది ఆనంద్ మహీంద్రా. ట్విట్టర్ లో సరికొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ..ప్రజలను ఆలోచింపజేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అది డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ ను ఉద్దేశించింది. ఒక వ్యక్తి టెన్త్, ఇంటర్, మెడిసిన్, జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్, స్పెషలిస్ట్ అనే వివిధ దశల్లో ఎలాంటి హ్యాండ్ రైటింగ్ లోకి మారుతాడు అనేది ఆ వీడియో లో కనిపిస్తుంది. టెన్త్, ఇంటర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు గుండ్రంగా అందంగా ఉన్న రైటింగ్ మెడిసిన్ పూర్తయ్యాక చండాలంగా మారుతోంది. ఫలితంగా వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్ లోని మందులను సాధారణ ప్రజలు సులభంగా అర్ధం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.

వైద్యుల హ్యాండ్ రైటింగ్ ను డిసైడ్ చేస్తున్నవి..

* చాలా మంది డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో గొలుసుకట్టు రాతలే ఉంటాయి. వైద్యవిద్య పూర్తయ్యే లోపు వాళ్ల చేతిరాతలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వీలైనంత తక్కువ టైంలో రాయటానికి అనువుగా ఉండేలా చాలా పదాలను స్కిప్ చేసేస్తూ రాయటం మొదలు పెడతారు. అదో కోడ్ లాంగ్వేజ్ అని చూసేవాళ్లకి అనుమానం వచ్చేలా మారిపోతుంది ఆ రాత.

* పోనీ డాక్టర్లు అయ్యాక ఏమన్నా రాయటం తగ్గుతుందా అంటే లేదు. మన దేశంలో సగటున ఓ ఎంబీబీఎస్ డాక్టర్  రోజుకు ముఫ్పై నుంచి ముఫ్పై ఐదు మంది పేషెంట్లకు వైద్యం అందిస్తారంట. బిజీగా ఉండే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రాసే అక్షరాలపై పట్టు కోల్పుతుంటారు.

* వాళ్లకు బాగా రాయాలని ఉన్నా అక్షరాలు రాస్తున్నప్పుడు అవి జారిపోతుంటాయి. పట్టు కోల్పోవటం లాంటి సమస్యే ఇది. తెలియకుండానే అక్షరాలు వేగంగా పడిపోతుంటాయి.ఫలితంగా గొలుసు కట్టు రాతల్లా కనిపిస్తుంటాయి.

*మన దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి శాతం చూస్తే చాలా తక్కువ. ప్రతీ వెయ్యిమందికి కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. సో ప్రతీ రోగికి ఎక్కువ సమయాన్ని కేటాయించటం వైద్యులకు కష్టమైన పనే. రోగి సమస్యలను శ్రద్ధగా వింటూ..వాళ్లు చెబుతున్నది జాగ్రత్తగా నోట్ చేస్తూ…ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంటుంది అది కూడా వేగంగా. ఫలితంగా వైద్యుల చేతిరాతపై ఈ అంశం ప్రభావం చూపిస్తోందని చెబుతారు.

*చాలా సార్లు వైద్యులు స్పెల్లింగుల విషయంలో డిస్ లెక్సియా గురవుతారని మరో పరిశోధనలో తేలింది. డిస్ లెక్సియా అంటే అక్షరాలు తారుమారు అవటం. రోజుకు కొన్ని వందల రకాల మందులు రాసే డాక్టర్లు ప్రతీ స్పెల్లింగునూ గుర్తు పెట్టుకోవటం కష్టం కనుక షార్ట్ కట్ లో రాసేందుకు అలవాటు పడతారని పరిశోధనల్లో తేలింది. కానీ డాక్టర్ ఏం రాసున్నారో మందుల షాపు వ్యక్తికి ఎలా అర్థం అవుతుంది. ఇందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి చాలా ఆసుపత్రులకు డెడికేటెడ్ మెడికల్ షాపులు ఉంటాయి. కనుక ఆ డాక్టర్ రాసే మందులు ఏంటో కాలక్రమేణా మెడికల్ షాపులో చేసిన వారికి అర్థమైపోతుంటుంది. రెండు కొన్ని సందర్భాల్లో దేని కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లారో ప్రిస్క్రిప్షన్ చూస్తూనే అడుగుతారు మెడికల్ షాపు వాళ్లు. కాంటెక్ట్స్ బట్టి రాసిన మెడిసిన్స్ ఇవి ఉండవచ్చు అని అర్థం చేసుకోగలుగుతారు.

* డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను సరిగా అర్థం చేసుకోలేకపోవటం వలన ఏడాదిలో కొన్ని మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. US లో మెడికల్ ఎర్రర్స్ కారణంగా ఏడాదిలో రెండు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో మరణాలకు కారణమవుతున్న వాటిలో మెడికల్ ఎర్రర్స్ ది మూడో స్థానం. వాటిలో ఎక్కువ శాతం ప్రిస్క్రిప్షన్ ను సరిగా అర్థం చేసుకోకపోవటమే. ఇండియాలో కూడా ఈ తరహా మరణాలు తక్కువేం కాదు. అందుకే చాలా న్యాయస్థానాలు ఆసుపత్రులు “ఈ- ప్రిస్ర్కిప్షన్” విధానాన్ని అవలంబించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.